మాసీ కాంబో.. మరోసారి!

ABN , First Publish Date - 2023-10-26T01:55:57+05:30 IST

హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌కు తిరుగులేదు అని ఇంతకుముందు వచ్చిన ‘డాన్‌ శీను’, ‘బలుపు’, ‘క్రాక్‌’ చిత్రాలు నిరూపించాయి...

మాసీ కాంబో.. మరోసారి!

హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌కు తిరుగులేదు అని ఇంతకుముందు వచ్చిన ‘డాన్‌ శీను’, ‘బలుపు’, ‘క్రాక్‌’ చిత్రాలు నిరూపించాయి. ఇప్పుడు వీరిద్దరూ కలసి నాలుగోసారి పని చేయనున్నారు. ఈ మాసీ కాంబోలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఓ భారీ చిత్రాన్ని నిర్మించనుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా యూనిక్‌, పవర్‌ఫుల్‌ కథతో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ‘బ్లాస్టింగ్‌ అప్‌డేట్స్‌ కోసం సిద్ధంగా ఉండండి’ అని మేకర్స్‌ బుధవారం ప్రకటించారు. ఇందులో సెల్వ రాఘవన్‌ కీలక పాత్ర పోషించనున్నట్లు వెల్లడించి, ఆయన పోస్టర్‌ను విడుదల చేశారు. తమన్‌ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ఇటీవల ‘జవాన్‌’ చిత్రానికి పని చేసిన ఛాయాగ్రాహకుడు జీకే విష్ణు డీవోపీగా వర్క్‌ చేస్తారు. ఇంతవరకూ పోషించని ఓ విభిన్న పాత్రలో రవితేజ కనిపించే ఈ చిత్రానికి నిర్మాతలు: నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌

Updated Date - 2023-10-26T01:55:57+05:30 IST