తిరుపతిలో వినరో భాగ్యము...
ABN, First Publish Date - 2023-02-14T03:14:58+05:30
కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడిగా పరిచయమవుతున్నారు...
కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గీతాఆర్ట్స్ 2 బేనర్‌పై బన్నీవాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పకులు. కశ్మీరా పరదేశీ కథానాయిక. ఈనెల 18న విడుదలవుతోంది. ఈ సినిమా చిత్రీకరణలో అధికభాగం తిరుపతి పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుకను చిత్రబృందం తిరుపతిలో ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా తాళ్లపాక అన్నమాచార్యుల వారసులను సన్మానించారు. చిత్రంలోని కొన్ని పాటలను ప్రేక్షకులతో విడుదల చేయించారు.