తిరుపతిలో వినరో భాగ్యము...

ABN , First Publish Date - 2023-02-14T03:14:58+05:30 IST

కిరణ్‌ అబ్బవరం హీరోగా రూపొందిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. మురళీ కిషోర్‌ అబ్బూరు దర్శకుడిగా పరిచయమవుతున్నారు...

తిరుపతిలో వినరో భాగ్యము...

కిరణ్‌ అబ్బవరం హీరోగా రూపొందిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. మురళీ కిషోర్‌ అబ్బూరు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గీతాఆర్ట్స్‌ 2 బేనర్‌పై బన్నీవాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పకులు. కశ్మీరా పరదేశీ కథానాయిక. ఈనెల 18న విడుదలవుతోంది. ఈ సినిమా చిత్రీకరణలో అధికభాగం తిరుపతి పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఈ సినిమా ఆడియో రిలీజ్‌ వేడుకను చిత్రబృందం తిరుపతిలో ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా తాళ్లపాక అన్నమాచార్యుల వారసులను సన్మానించారు. చిత్రంలోని కొన్ని పాటలను ప్రేక్షకులతో విడుదల చేయించారు.

Updated Date - 2023-02-14T03:15:05+05:30 IST