ప్రేమ కథలు చేయాలని ఉంది

ABN , First Publish Date - 2023-08-22T00:28:15+05:30 IST

ఏజెంట్‌’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది సాక్షి వైద్య. ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర పరాజయం పాలైంది. అయినా సరే...

ప్రేమ కథలు చేయాలని ఉంది

ఏజెంట్‌’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది సాక్షి వైద్య. ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర పరాజయం పాలైంది. అయినా సరే.. సాక్షికి మంచి అవకాశాలే వస్తున్నాయి. తన చేతిలో ప్రస్తుతం 3 సినిమాలున్నాయి. వరుణ్‌తేజ్‌తో కలసి నటించిన ‘గాంఢీవధారి అర్జున’ ఈనెల 25న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సాక్షి ఏమన్నారంటే..?

‘‘ఏజెంట్‌ సినిమా చేస్తున్నప్పుడే నాకు ఈ ఆఫర్‌ వచ్చింది. అందులో నా స్టిల్స్‌ చూసి ప్రవీణ్‌ సత్తారు నన్ను సంప్రదించారు. ‘ఏజెంట్‌’, ‘గాంఢీవధారి అర్జున’ రెండూ యాక్షన్‌ కథలే. తెలుగులో ఇలాంటి కథలతో నన్ను స్వాగతం పలకడం ఆనందంగా ఉంది’’.

‘‘వరుణ్‌ చాలా సపోర్టివ్‌. నన్ను చాలా బాగా చూసుకొన్నాడు. నిజం చెప్పాలంటే తనతో మాట్లాడ్డానికి నేనే భయపడ్డా. చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చాడు. ఎలా రిసీవ్‌ చేసుకొంటాడో అనుకొన్నా. కానీ తనే చొరవ తీసుకొని నాతో మాట్లాడేవాడు’’. ‘‘ఫలానా జోనర్‌లోనే నటించాలని ఏం లేదు. ఎలాంటి కథలొచ్చినా చేస్తా. అయితే లవ్‌ స్టోరీలు చేయాలని ఉంది. అందులో కథానాయికలకు మంచి స్కోప్‌ ఉంటుంది’’.

Updated Date - 2023-08-22T00:28:20+05:30 IST