దర్శకుడి స్వీయ అనుభవాలే ‘లవ్‌ మౌళి’

ABN , First Publish Date - 2023-11-28T06:07:15+05:30 IST

నవదీప్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘లవ్‌ మౌళి’. అవనీంద్ర దర్శకుడు. వైరా క్రియేషన్స్‌ శ్రీకర స్డూడియోస్‌ సంస్థలు నిర్మించాయి...

దర్శకుడి స్వీయ అనుభవాలే ‘లవ్‌ మౌళి’

నవదీప్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘లవ్‌ మౌళి’. అవనీంద్ర దర్శకుడు. వైరా క్రియేషన్స్‌ శ్రీకర స్డూడియోస్‌ సంస్థలు నిర్మించాయి. సోమవారం హైదరాబాద్‌లో టీజర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నవదీప్‌ మాట్లాడుతూ ‘‘జీవితంలో చాలా చేయాలనుకొంటాం. ఆ ప్రయత్నంలో ఏవేవో చేస్తుంటాం. నేను కూడా అంతే. చేయాలనుకొన్నదొకటి. చేసిందొకటి. అనవసరమైన సినిమాలు కొన్ని చేశా. లాక్‌ డౌన్‌ సమయంలో కాస్త ఆగి, నన్ను నేను చెక్‌ చేసుకొన్నా. అలాంటి సమయంలో నాకు ఎదురైన కథ ఇది. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకొన్న ప్రయత్నం ఈ సినిమా’’ అన్నారు. ‘‘నా జీవితంలో జరిగిన ప్రేమ కథల సమాహారం ఈ సినిమా. నేను పాన్‌ ఇండియా స్థాయి ప్రేమికుడ్ని. నా స్వీయ అనుభవాలతోనే ఈ కథ మలిచా’’ అన్నారు దర్శకుడు. సంగీత దర్శకుడు గోవింద్‌ వసంత మాట్లాడుతూ ‘‘ఈ కథతోనూ, ఈ పాటలతోనూ నేను ప్రేమలో పడిపోయాను. ఇప్పుడు నేపథ్య సంగీతాన్నీ ఆస్వాదిస్తున్నా’’ అన్నారు.

Updated Date - 2023-11-28T06:07:18+05:30 IST