బన్నీతో సినిమా కోసం ఎదురుచూస్తున్నా
ABN , First Publish Date - 2023-11-29T01:16:35+05:30 IST
‘పుష్ప’ చిత్రంతో జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని అందుకొని తెలుగు ప్రజలు గర్వపడేలా చేశారు అల్లు అర్జున్. అప్పటి నుంచి ఆయనతో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ దర్శకులు...
‘పుష్ప’ చిత్రంతో జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని అందుకొని తెలుగు ప్రజలు గర్వపడేలా చేశారు అల్లు అర్జున్. అప్పటి నుంచి ఆయనతో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్లు ఆసక్తి చూపుతున్నారు. బన్నీతో ఒక్క సినిమాలో అయినా కలసి నటించాలనుందని పలువురు హీరోయిన్లు తమ కోరికను వెలిబుచ్చారు. జాతీయ ఉత్తమనటిగా నిలిచిన కృతీసనన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. జాతీయ పురస్కారాల వేడుకలో అల్లు అర్జున్‌తో కలసి కృతీ సందడి చేశారు. బన్నీతో కలసి నటించాలనుందని ఆమె అప్పుడే చెప్పారు. ఇప్పుడు మరోసారి తన కోరికను బయటపెట్టారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘అల్లు అర్జున్ అద్భుతమైన నటుడు. ఆయనకు నేను పెద్ద అభిమానిని. జాతీయ పురస్కారాల వేడుకలో ఆయన్ను తొలిసారి చూశాను. ఇద్దరం చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం. బన్నీతో కలసి సినిమా చేసేందుకు ఎదురుచూస్తున్నా. మా ఇద్దరితో ఎవరైనా దర్శకుడు ఓ మంచి సినిమా చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు.