సాహిత్య మూలాలే సినిమాల్లో నిలబెట్టాయి

ABN , First Publish Date - 2023-12-13T03:21:49+05:30 IST

సాహిత్య రచయితగా ప్రయాణం మొదలుపెట్టి సినీ పరిశ్రమలో మాటల సౌరభాలు వెదజల్లుతున్న కథకుడు నాగేంద్రకాశి. ‘నల్లవంతెన’ కథల సంపుటితో...

సాహిత్య మూలాలే సినిమాల్లో నిలబెట్టాయి

సాహిత్య రచయితగా ప్రయాణం మొదలుపెట్టి సినీ పరిశ్రమలో మాటల సౌరభాలు వెదజల్లుతున్న కథకుడు నాగేంద్రకాశి. ‘నల్లవంతెన’ కథల సంపుటితో దర్శకుడు సుకుమార్‌ దృష్టిని ఆకర్షించి, ఆయన ప్రోత్సాహంతో ఇప్పటిదాకా పలు హిట్‌ చిత్రాలకు కథ, మాటలు అందించారు. ఇటీవలే విడుదలైన ‘కోటబొమ్మాళి పీఎస్‌’, ‘హాయ్‌నాన్న’ చిత్రాల్లో తన పదునైన సంభాషణలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా నాగేంద్ర కాశి మీడియాతో మాట్లాడారు.

  • చిన్నప్పటి నుంచి సాహిత్యంపైన ఉన్న ఆసక్తే రచయితనయ్యేందుకు ప్రేరణనిచ్చింది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తూనే నా ఆలోచనలకు అక్షరరూపం ఇచ్చేవాణ్ణి. దర్శకుడు కరుణకుమార్‌తో పరిచయం వల్ల ‘పలాస’ సినిమాకు సహ రచయితగా అవకాశం ఇచ్చారు. తర్వాత ‘శ్రీదేవి సోడా సెంటర్‌’, ‘విరూపాక్ష’ సహా పలు చిత్రాలు పేరు తెచ్చాయి.

  • సాహిత్యమూలాల నుంచి వచ్చిన రచయితలు ఒక సన్నివేశాశం లోతు, ఆర్ద్రతను చూసే విధానం వేరుగా ఉంటుంది. అదే చిత్ర పరిశ్రమలో నన్ను ప్రత్యేకంగా నిలిపిందనుకుంటాను. నేను చదువుకున్న సాహిత్యపు విలువలే నా కథ, మాటల్లో ప్రతిబింబిస్తాయి. అందుకే అవి ప్రేక్షకుల హృదయాలను తాకుతున్నాయి.

  • మాది అమలాపురం. సుకుమార్‌ మా ప్రాంతం వ్యక్తి కావడంతో ఆయనలా గొప్పగా కథలు చెప్పాలనిపించేది. పరిశ్రమలో నా ఎదుగుదలకు వెన్నుతట్టి ప్రోత్సహించారు. ‘కోటబొమ్మాళి పీఎస్‌’ చూసి సుకుమార్‌, అల్లు అరవింద్‌ గారు అందించిన ప్రశంసలు మరువలేనివి. ప్రస్తుతం ‘పుష్ప 2’, రామ్‌చరణ్‌, బుచ్చిబాబు సినిమాల రచయితల విభాగంలో పనిచేస్తున్నాను. రష్మిక ‘రెయిన్‌బో’ చిత్రానికి మాటలు అందిస్తున్నాను.

Updated Date - 2023-12-13T03:21:51+05:30 IST