లింగోచ్చా ఆడిన ప్రేమాట!
ABN , First Publish Date - 2023-10-11T04:47:39+05:30 IST
కార్తీక్ రత్నం కథానాయకుడిగా నటించిన చిత్రం ‘లింగోచ్చా’. గేమ్ ఆఫ్ లవ్ అనేది ఉపశీర్షిక. సుప్యర్థ సింగ్ కథానాయిక. ఆనంద్ బడా దర్శకుడు....

యాదగిరి రాజు నిర్మాత. ఈనెల 27న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘హైదరాబాద్ నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. యువతకు నచ్చేలా తీర్చిదిద్దాం. కార్తీక్ రత్నం ఈ సినిమాతో హీరోగా పది మెట్లు ఎక్కుతాడు. కథానాయిక సుప్యర్థ కుర్నాళ్ల మనసుల్ని కొల్లగొడుతుంది. మంచి పాటలు వచ్చాయి. నిర్మాత సహకారం మర్చిపోలేనిది’’ అన్నారు. ఉత్తేజ్, తాగుబోతు రమేశ్, కునాల్ కౌశిక్, భల్వీర్ సింగ్ తదితరులు నటించారు. సంగీతం: బికాజ్ రాజ్.