రజనీకాంత్ సోదరిగా జీవిత
ABN, First Publish Date - 2023-03-01T00:59:46+05:30
నటి, దర్శకురాలు జీవిత సుదీర్ఘ విరామం తరవాత మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నారు. రజనీకాంత్ చిత్రంలో ఆమెకు ఓ కీలకమైన పాత్ర దక్కింది...
నటి, దర్శకురాలు జీవిత సుదీర్ఘ విరామం తరవాత మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నారు. రజనీకాంత్ చిత్రంలో ఆమెకు ఓ కీలకమైన పాత్ర దక్కింది. రజనీకాంత్ హీరోగా ‘లాల్ సలామ్’ అనే చిత్రం రూపుదిద్దు కొంటోంది. రజనీ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జైంట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కథలో రజనీ సోదరి పాత్రకి చాలా ప్రాధాన్యం ఉంది. ఆ పాత్ర కోసం చాలామంది నటీమణుల పేర్లు పరిశీలించి, చివరికి జీవితని ఎంచుకొన్నారు.
నటనకు దూరంగా ఉంటున్నా, రజనీ సినిమా కాబట్టి... ఇందులో నటించడానికి అంగీకరించారు జీవిత. ఈనెల 7న ఆమె సెట్లో అడుగుపెట్టబోతున్నారు. ఈ చిత్రానికి రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.