సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

LGM : ధోనీ ఇచ్చిన మరో షాక్‌.. ఎల్‌.జి.ఎమ్‌

ABN, First Publish Date - 2023-07-25T03:16:43+05:30

లె జెండరీ క్రికెటర్‌ ఎం.ఎ్‌స.ధోనీ నిర్మాణరంగంలోకి అడుగుపెట్టారు. ఆయన నిర్మించిన చిత్రం ‘ఎల్‌జిఎమ్‌’ (లెట్స్‌ గెట్‌ మారీడ్‌). హరీశ్‌ కల్యాణ్‌, ఇవానా, నదియా, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు.

లె జెండరీ క్రికెటర్‌ ఎం.ఎ్‌స.ధోనీ నిర్మాణరంగంలోకి అడుగుపెట్టారు. ఆయన నిర్మించిన చిత్రం ‘ఎల్‌జిఎమ్‌’ (లెట్స్‌ గెట్‌ మారీడ్‌). హరీశ్‌ కల్యాణ్‌, ఇవానా, నదియా, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సాక్షి ధోని, వికాస్‌ హస్జా నిర్మించారు. ఆగస్టు 4న విడుదల అవుతోంది. సోమవారం హైదరాబాద్‌లో యువ కథానాయకుడు సుధీర్‌బాబు చేతుల మీదుగా ట్రైలర్‌ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ‘‘క్రికెట్‌లో ధోనీ ఓ సంచలనం. ఆయన నిర్మాతగానూ విజయాలు అందుకోవాలి. ట్రైలర్‌ చాలా బాగుంద’’న్నారు. సాక్షి ధోనీ మాట్లాడుతూ ‘‘ధోనీ ఎక్కువ సర్‌ప్రైజ్‌లు ఇస్తుంటారు. ఆయన ఇచ్చిన మరో షాక్‌ ఈ సినిమా. క్రికెట్‌లానే సినిమా కూడా వినోద సాధనమే. అందుకే మేం ఈ పరిశ్రమలోకి అడుగుపెట్టాం. ఇది తమిళ చిత్రమే. కానీ.. ధోనీకి తెలుగులో చాలామంది అభిమానులు ఉన్నారు. వాళ్లకోసమే తెలుగులోనూ ఈ చిత్రాన్ని డబ్‌ చేశాం’’ అన్నారు.

Updated Date - 2023-07-25T12:34:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!