మాట్లాడుకోనివ్వండి.. ఏం చేస్తాం?

ABN , First Publish Date - 2023-03-07T00:31:20+05:30 IST

ఈ మధ్య తరచూ వార్తల్లో వినిపిస్తున్న పేరు అదితిరావు హైదరీ. కథానాయకుడు సిద్దార్థ్‌తో డేటింగ్‌ చేస్తోందన్న కబుర్లతో తను ఇంకాస్త పాపులర్‌ అయిపోయింది...

మాట్లాడుకోనివ్వండి.. ఏం చేస్తాం?

ఈ మధ్య తరచూ వార్తల్లో వినిపిస్తున్న పేరు అదితిరావు హైదరీ. కథానాయకుడు సిద్దార్థ్‌తో డేటింగ్‌ చేస్తోందన్న కబుర్లతో తను ఇంకాస్త పాపులర్‌ అయిపోయింది. ‘మహా సముద్రం’లో వీరిద్దరూ జంటగా నటించారు. అప్పటి నుంచీ ఇద్దరి మధ్య అనుబంధం పెనవేసుకుపోయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దానికి తోడు.. ఎక్కడకు వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్తున్నారు. రీల్స్‌ కోసం పాటలకు స్టెప్పులు వేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఏదోలా టచ్‌లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సిద్దార్థ్‌తో ప్రేమ నిజమేనా? అనే ప్రశ్న ఓ ఇంటర్వ్యూలో అదితిరావుకి ఎదురైంది. దానికి ‘కర్ర విరగలేదు, పాము చావలేదు’ అనే శైలిలో సమాధానం ఇచ్చింది. ‘‘జనాలు ఏదేదో మాట్లాడుకొంటారు. వాళ్లకు ఏ విషయంపై ఆసక్తి ఉందో.. దాని గురించే చర్చించుకొంటారు. వాళ్లని మనం ఆపలేం. ఈ విషయంలో నేను చేయగలిగిందేం లేదు. నాకు సినిమాలంటే ఆసక్తి. దానిపైనే ధ్యాస. నన్ను నమ్మి దర్శకులు నాకు పాత్రలు ఇచ్చేంత వరకూ, నన్ను ప్రేక్షకులు ఆదిరించేంత వరకూ నేను సంతోషంగా ఉంటాను. ఇలాంటి విషయాల గురించి పట్టించుకోను. జనం గురించి ఆలోచించను’’ అంటూ బదులిచ్చింది.

Updated Date - 2023-03-07T00:31:20+05:30 IST