చెత్తను కాదు ప్రేమను పంచుదాం
ABN , First Publish Date - 2023-11-10T02:23:59+05:30 IST
టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో ఘటనపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ తరహా మార్ఫింగ్ వీడి యోలను నెట్టింట వైరల్ చేయడంపై హీరోయిన్ కీర్తిసురేశ్ ...

టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో ఘటనపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ తరహా మార్ఫింగ్ వీడి యోలను నెట్టింట వైరల్ చేయడంపై హీరోయిన్ కీర్తిసురేశ్ అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి చెత్త వీడియోలకు బదులు నలుగురికీ ఉపయోగపడే పని చేసి ఉంటే బావుండేదని కీర్తి సోషల్ మీడియాలో హితవు పలికారు. తోటివాళ్లను ఇబ్బంది పెట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరు చూస్తుంటే ఈ రోజుల్లో సాంకేతికత అనేది మనుషులకు వరమో శాపమో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. తోటి వారికి ధైర్యాన్నివ్వడానికీ, ప్రేమ పంచడానికీ, మంచి విషయాలపై అవగాహన కలిగించడానికీ సోషల్ మీడియాను ఉపయోగిద్దాం... చెత్తను పంచడానికి కాదు’ అని ఆమె తన ట్వీట్‌లో పేర్కొన్నారు.