మళ్లీ భయపెడతాం

ABN , First Publish Date - 2023-09-24T02:18:59+05:30 IST

హారర్‌ నేపథ్యంలో వచ్చిన ‘గీతాంజలి’ చక్కటి విజయాన్ని అందుకొంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ వస్తోంది. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనేది టైటిల్‌...

మళ్లీ భయపెడతాం

హారర్‌ నేపథ్యంలో వచ్చిన ‘గీతాంజలి’ చక్కటి విజయాన్ని అందుకొంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ వస్తోంది. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనేది టైటిల్‌. అంజలి, శ్రీనివాస రెడ్డి, సత్యం రాజేశ్‌, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. శివ తుర్లపాటి దర్శకుడు. కోన వెంకట్‌ కథ, స్ర్కీన్‌ ప్లే అందిస్తున్నారు. ఎం.వీ.వీ సినిమా, కోన వెంకట్‌ ఫిల్మ్‌ కొర్పొరేషన్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శనివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ‘‘అంజలి నటిస్తున్న 50వ చిత్రమిది. గుర్తుండిపోయేలా రూపొందిస్తున్నాం. ‘గీతాంజలి’ కంటే పది రెట్లు ఎక్కువ భయపెడతాం’’ అని దర్శక నిర్మాతలు తెలిపారు.

Updated Date - 2023-09-24T02:18:59+05:30 IST