సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

నన్నూ నా పిల్లల్నీ వదిలేయండి.. ప్లీజ్‌!

ABN, First Publish Date - 2023-04-10T01:11:37+05:30

సెలబ్రిటీగా బతకడం అనుకొన్నంత సులభమేం కాదు. వాళ్లు బయటకు వస్తే చాలు. సెల్ఫీలంటూ ఎగబడతారు జనాలు. ఇస్తే ఒక బాధ ఇవ్వకపోతే మరో బాధ. తారలు ఏం చేసినా అదో వార్త అయిపోతుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సెలబ్రిటీగా బతకడం అనుకొన్నంత సులభమేం కాదు. వాళ్లు బయటకు వస్తే చాలు. సెల్ఫీలంటూ ఎగబడతారు జనాలు. ఇస్తే ఒక బాధ ఇవ్వకపోతే మరో బాధ. తారలు ఏం చేసినా అదో వార్త అయిపోతుంది. చిన్న చిన్న విషయాలకు భూతద్దం పెట్టి చూస్తుంటారు. అందుకే తారలూ విసిగిపోతున్నారు. ప్రీతీజింటా కూడా ఈ విషయంలో అసహనాన్ని వ్యక్తం చేసింది. ‘‘ఈ వారంలో రెండు ఘటనలు నన్ను ఇబ్బంది పెట్టాయి. ఓ మహిళ నా కుమార్తె జియా ఫొటో తీయడానికి ప్రయత్నిస్తే.. నేను చాలా మార్యాదపూర్వకంగానే తిరస్కరించాను. కానీ ఆమె మాత్రం తన దురుసుదనం చూపించింది. జియాని లాక్కొని బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్లిపోయింది. నేను సెలబ్రిటీని కాకపోతే, స్పందించే విధానమే మారిపోయేదేమో? ఆ సమయంలో నేను సహనాన్ని ప్రదర్శించాల్సివచ్చింది. మరో సందర్భంలో నేను అర్జెంటుగా ఎయిర్‌పోర్టుకి వెళ్తున్నప్పుడు ఓ వ్యక్తి రోడ్డుపై నన్ను అడ్డుకోవాలని చూశాడు. డబ్బులు అడిగాడు. తను చాలా రోజుల నుంచి నన్ను వేధిస్తున్నాడు. అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చాను. కానీ ఆరోజు నా దగ్గర క్రెడిట్‌ కార్డులు తప్ప క్యాష్‌ లేదు. అదే విషయాన్ని మార్యాదగా చెప్పా. క్షమాపణలు కూడా కోరా. కానీ తను నన్ను వెంబడించడం మానలేదు. మరో మహిళ తనకు డబ్బులిస్తే సరిపోలేదని విసిరేశాడు. దుర్భాషలు ఆడాడు. ఫొటోగ్రాఫర్లు ఈ తతంగాన్ని నవ్వుతూ చూశారు. ఫొటోలు తీశారు తప్ప, అతన్నెవరూ ఆపలేదు. కారుని వెంబడించొద్దని ఎవరూ వారించలేదు. ఆ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే ఎవరిది బాధ్యత? ఈ వీడియోలు వైరల్‌ అయ్యాయి. నన్నంతా తప్పుపట్టారు. కానీ అక్కడ జరిగిన విషయం వేరు. సెలబ్రిటీ అయినంత మాత్రాన మా ఇష్టం వచ్చినట్టు బతికే హక్కు మాకు లేదా? ముందు నేను మనిషిని, ఆ తరవాత నా బిడ్డలకు తల్లిని, ఆ తరవాతే.. సెలబ్రిటీని. నన్ను, నా పిల్లలను స్వేచ్ఛగా వదిలేయండి.. ప్లీజ్‌’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా తన బాధని వెళ్లగక్కింది ప్రీతీ.

Updated Date - 2023-04-10T01:11:39+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!