నిర్మాతగా మరో వారసురాలు

ABN , First Publish Date - 2023-06-30T23:51:39+05:30 IST

దివంగత నటుడు జయప్రకాశ్‌ రెడ్డి కుమార్తె మల్లికా రెడ్డి నిర్మాతగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు.

నిర్మాతగా మరో వారసురాలు

దివంగత నటుడు జయప్రకాశ్‌ రెడ్డి కుమార్తె మల్లికా రెడ్డి నిర్మాతగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. శ్రీ జయప్రకాశ్‌రెడ్డి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఆమె నిర్మిస్తున్న చిత్రం గురువారం ప్రారంభమైంది. నరేన్‌ వనపర్తి, పాయల్‌ గుప్తా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి అవినాష్‌ కొకటి దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు బి. గోపాల్‌ క్లాప్‌ ఇచ్చారు. నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. నక్కిన త్రినాథ్‌రావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా మల్లికారెడ్డి మాట్లాడుతూ ‘నాన్నగారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చిత్ర నిర్మాణంలోకి వచ్చాను. ఈ సినిమాకు మంచి టీమ్‌ కుదిరింది. ప్రేక్షకులను అలరించే చిత్రాలను జేపీ బ్యానర్‌పై అందిస్తామ’న్నారు. ఇదొక యూత్‌ఫుల్‌ ఎంటర్టైనర్‌, కథ కొత్తగా ఉంటుంది అని నరేన్‌ చెప్పారు. ఆగస్టు నుంచి చిత్రీకరణ మొదలుపెడతామని దర్శకుడు తెలిపారు.

Updated Date - 2023-06-30T23:51:47+05:30 IST