కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బాబూజీతో లాల్‌ బహదూర్‌ శాస్త్రి

ABN, First Publish Date - 2023-08-08T03:30:24+05:30

మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబూ జగజ్జీవన్‌ రామ్‌ జీవిత కథను ‘బాబూజీ’ పేరుతో దిలీప్‌ రాజా దర్శకత్వంలో విజయచంద్ర బోనేల నిర్మిస్తున్న సంగతి విదితమే. భారత తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ...

మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబూ జగజ్జీవన్‌ రామ్‌ జీవిత కథను ‘బాబూజీ’ పేరుతో దిలీప్‌ రాజా దర్శకత్వంలో విజయచంద్ర బోనేల నిర్మిస్తున్న సంగతి విదితమే. భారత తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ మంత్రివర్గంలో రైల్వే మంత్రిగా లాల్‌ బహదూర్‌ శాస్ర్తి, కార్మిక మంత్రిగా జగజ్జీవన్‌ రామ్‌ పని చేశారు. ఇందుకు సంబంధించిన సన్నివేశాలను సోమవారం తెనాలిలోని రత్న ఫ్యార్చ్యూన్‌లో చిత్రీకరించారు దిలీప్‌ రాజా. తమిళనాడులోని అరియలూర్‌లో జరిగిన రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ లాల్‌ బహదూర్‌ శాస్త్రి తన మంత్రి పదవికి రాజీనామా చేయడం, ప్రధాని నెహ్రూ అదే శాఖను జగజ్జీవన్‌ రామ్‌కు కేటాయించడం వంటి సన్నివేశాలను చిత్రీకరించినట్లు దర్శకుడు చెప్పారు. ఈ సినిమాలో జగజ్జీవన్‌ రామ్‌ పాత్రను మాజీ సైనికుడు మిలటరీ ప్రసాద్‌, లాల్‌ బహుదూర్‌ శాస్త్రి పాత్రను ఉత్తరప్రదేశ్‌కు చెందిన అమీర్‌ చౌదరి పోషిస్తున్నారు.

Updated Date - 2023-08-08T03:30:24+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!