‘లగాన్’ నటుడు జావేద్ ఖాన్ కన్నుమూత
ABN , First Publish Date - 2023-02-15T00:14:24+05:30 IST
మరో ప్రతిభావంతుడైన నటుడిని బాలీవుడ్ కోల్పోయింది. తన విశిష్ట నటనతో ప్రేక్షకుల మెప్పు పొందిన జావేద్ ఖాన్ అమ్రోహి ఇక లేరు...
మరో ప్రతిభావంతుడైన నటుడిని బాలీవుడ్ కోల్పోయింది. తన విశిష్ట నటనతో ప్రేక్షకుల మెప్పు పొందిన జావేద్ ఖాన్ అమ్రోహి ఇక లేరు. ఆమిర్‌ఖాన్ హీరోగా 2001లో వచ్చిన ‘లగాన్’ చిత్రంలో నటించి అందరి దృష్టినీ ఆకర్షించిన జావేద్ ఖాన్(60) మంగళవారం ఉదయం ముంబైలో కన్ను మూశారు. సంవత్సర కాలంగా ఆయన శ్వాస సంబంధమైన సమస్యలతో బాధ పడుతున్నారు. శాంతా క్రుజ్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జావేద్ ఊపిరితిత్తులు రెండూ దెబ్బ తినడంతో తుది శ్వాస విడిచారు. జావేద్ 150కి పైగా చిత్రాల్లో నటించారు. ‘లగాన్’ చిత్రంలో అద్భుత నటన ప్రదర్శించడంతో ఉత్తమ నటుడు కేటగిరిలో ఆస్కార్ అవార్డ్స్‌కు కూడా నామినేట్ అయ్యారు. అలాగే ‘అందాజ్ అప్నా అప్పా’ , ‘చక్ దే ఇండియా’ వంటి చిత్రాల్లో జావిద్ నటన ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. ‘మీర్జా గాలిబ్’ వంటి టీవీ సీరియల్స్‌లో నటించిన జావేద్ జీ ఇన్‌స్టిట్యూట్ మీడియా ఆర్ట్స్‌లో యాక్టింగ్ ఫ్యాకల్టీ గా కూడా కొంత కాలం పని చేశారు.