లేడీస్ టైలర్ మ్యాజిక్ రిపీట్
ABN, First Publish Date - 2023-11-29T01:22:28+05:30
ముప్ఫై ఏడేళ్ల క్రితం విడుదలైన ‘లేడీస్ టైలర్’ని ఎవరూ మర్చిపోలేరు. సుందరంగా రాజేంద్ర ప్రసాద్, సుజాత పాత్రలో అర్చన జీవించేశారు...
ముప్ఫై ఏడేళ్ల క్రితం విడుదలైన ‘లేడీస్ టైలర్’ని ఎవరూ మర్చిపోలేరు. సుందరంగా రాజేంద్ర ప్రసాద్, సుజాత పాత్రలో అర్చన జీవించేశారు. వాళ్ల కెమిస్ర్టీ సూపర్బ్‌గా కుదిరింది. ఇన్నాళ్లకు మళ్లీ వీరిద్దరూ జంటగా ఓ సినిమా చేశారు. అదే ‘షష్టి పూర్తి’. రూపేశ్, ఆకాంక్ష సింగ్ మరో జంటగా నటించారు. పవన్ ప్రభ దర్శకుడు. రూపేశ్ కుమార్ చౌదరి నిర్మాత. ఇప్పటికి 80 శాతం షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘తల్లిదండ్రుల పెళ్లిని వాళ్ల పిల్లలు చూడలేరు. కానీ ఆ ఆవకాశం ‘షష్టిపూర్తి’ రూపంలో భగవంతుడు ప్రసాదించాడు. అలా తల్లిదండ్రులకు షష్టి పూర్తి చేయాలనుకొనే పిల్లల కథ ఇది. రాజేంద్ర ప్రసాద్, అర్చన ‘లేడీస్ టైలర్’లానే, ఈ సినిమాతోనూ మ్యాజిక్ చేశారు. బంధాలు, అనుబంధాల విలువ చెప్పే చిత్రమిది. గోదావరి జిల్లాల్లోని అందమైన ప్రదేశాల్లో షూటింగ్ జరిపాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు.