క్రిష్‌ 4 ..దర్శకుడు ఎవరంటే..

ABN , First Publish Date - 2023-04-18T03:19:26+05:30 IST

సూపర్‌ హీరో ఫార్ములాతో బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ నటించిన ‘క్రిష్‌’ ఫ్రాంఛైజీలో మొదటిది ‘కోయి మిల్‌ గయా’ చిత్రం విడుదలై ఇరవై ఏళ్లు కావస్తోంది. 2003లో విడుదలైన ఈ సినిమా అనూహ్య విజయం సాధించడంతో...

క్రిష్‌ 4 ..దర్శకుడు ఎవరంటే..

సూపర్‌ హీరో ఫార్ములాతో బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ నటించిన ‘క్రిష్‌’ ఫ్రాంఛైజీలో మొదటిది ‘కోయి మిల్‌ గయా’ చిత్రం విడుదలై ఇరవై ఏళ్లు కావస్తోంది. 2003లో విడుదలైన ఈ సినిమా అనూహ్య విజయం సాధించడంతో 2006లో దీనికి సీక్వెల్‌గా ‘క్రిష్‌’ చిత్రం వచ్చింది. అదీ హిట్టే. ఆ తర్వాత ‘క్రిష్‌ 3’ కూడా రూపుదిద్దుకుంది. ఈ సినిమా కూడా విజయం సాదించింది. ఇప్పుడందరి దృష్టీ ‘క్రిష్‌ 4’ చిత్రం మీదే ఉంది. ఈ ఫ్రాంఛైజీలో ఇంతవరకూ వచ్చిన మూడు చిత్రాలకు హృతిక్‌ రోషన్‌ తండ్రి రాకేశ్‌ రోషన్‌ దర్శకత్వం వహించారు. అయితే ‘క్రిష్‌ 4’ చిత్రానికి మాత్రం సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తారనే వార్తలు వినిపించాయి. షారుఖ్‌ ఖాన్‌ హీరోగా ‘పఠాన్‌’ను రూపొందించిన సిద్దార్థ్‌కు ‘క్రిష్‌ 4’ దర్శకత్వ బాధ్యతలు అప్పగిస్తారనేది ఆ వార్తల సారాంశం. అయితే ఇందులో నిజం లేదని రాకేశ్‌ రోషన్‌ కొట్టిపడేశారు. ‘ఇంతవరకూ రాకేశ్‌ రోషన్‌ దర్శకత్వంలో రూపొందిన మూడు చిత్రాలూ ఘన విజయం సాదించాయి. నాలుగో సినిమాకూ ఆయనే దర్శకుడు. ప్రస్తుతం స్ర్కిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. అది పూర్తి కాగానే షూటింగ్‌ ఎప్పుడు మొదలవుతుందో వెల్లడిస్తారు.

Updated Date - 2023-04-18T03:19:29+05:30 IST