కోనసీమ కుర్రోళ్లు

ABN , First Publish Date - 2023-01-30T00:33:14+05:30 IST

డాన్స్‌ మాస్టర్‌ బృందా గోపాల్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన చిత్రం ‘థగ్స్‌’. తెలుగులో ‘కోనసీమ థగ్స్‌’ పేరుతో విడుదల అవుతోంది...

కోనసీమ కుర్రోళ్లు

డాన్స్‌ మాస్టర్‌ బృందా గోపాల్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన చిత్రం ‘థగ్స్‌’. తెలుగులో ‘కోనసీమ థగ్స్‌’ పేరుతో విడుదల అవుతోంది. హ్రిదు హరూన్‌ హీరోగా నటిస్తున్నాడు. బాబీ సింహా, ఆర్‌కే సురేశ్‌, మనిష్కంత్‌ ప్రధాన పాత్రలు పోషించారు. హెచ్‌.ఆర్‌ పిక్చర్స్‌, రియా శిబు సంయుక్తంగా నిర్మించాయి. ఇటీవల ట్రైలర్‌ విడుదల చేశారు. 2 నిమిషాల 23 సెకన్ల ఈ ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. జైలులోని క్రూరమైన వాతావరణం మధ్య నలిగిపోతున్న ఖైదీలు, అక్కడి నుంచి పారిపోవడానికి వేసే ఎత్తుగడలు థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయని చిత్ర బృందం తెలిపింది. ‘రా’ లొకేషన్లలో షూటింగ్‌ చేశామని, ప్రతి పాత్ర కొత్తగా అనిపిస్తుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి శామ్‌ సి.ఎస్‌ సంగీతాన్ని అందించారు.

Updated Date - 2023-01-30T00:33:16+05:30 IST