కొట్టేయి తాళం.. తీసేయి గొళ్లెం
ABN , First Publish Date - 2023-08-04T03:00:28+05:30 IST
కార్తికేయ, నేహాశెట్టి జంటగా నటించిన చిత్రం ‘బెదురులంక 2012’. క్లాక్స్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాత...

కార్తికేయ, నేహాశెట్టి జంటగా నటించిన చిత్రం ‘బెదురులంక 2012’. క్లాక్స్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాత. ఈనెల 25న విడుదల అవుతోంది. గురువారం ఈ చిత్రం నుంచి ‘దొంగోడే దొరగాడు’ అనే పాట బయటకు వచ్చింది. ‘కొట్టేయి తాళం.. తీసేయి గొళ్లెం.. దొరికిందంతా దోచేయ్ రా..’ అంటూ ముగ్గురు దొంగల నేపథ్యంలో సాగే పాట ఇది. సాహితి చాగంటి ఆలపించారు. కిట్టూ విస్సాప్రగడ రాశారు. మణిశర్మ స్వరాలు అందించారు. ‘‘ఓ మతం, ఓ సంప్రదాయం, ఓ ఆచారం అని కాదు. ప్రతిచోటా, ప్రతి ఊరిలోనూ దోచుకొనేవాళ్లు ఉంటారు అని చెప్పే పాట ఇది. భక్తి, నమ్మకం మాయలో ప్రజల్ని ఎవరు ఎలా దోచుకొంటున్నారో ఈ పాటలో చెప్పామ’’న్నారు దర్శకుడు. అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, రాజ్ కుమార్ కసిరెడ్డి, ఆటో రాంప్రసాద్ తదితరులు నటించారు.