కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బాల్య స్నేహితుల కిస్మత్‌

ABN, First Publish Date - 2023-10-16T01:54:49+05:30

నరేశ్‌ అగస్త్య, అభినవ్‌ గోమఠం హీరోలుగా నటించిన చిత్రం ‘కిస్మత్‌’. శ్రీనాథ్‌ బాదినేని దర్శకత్వంలో రాజు నిర్మించారు. రియా సుమన్‌, అవసరాల శ్రీనివాస్‌ కీలకపాత్రలు పోషించారు...

నరేశ్‌ అగస్త్య, అభినవ్‌ గోమఠం హీరోలుగా నటించిన చిత్రం ‘కిస్మత్‌’. శ్రీనాథ్‌ బాదినేని దర్శకత్వంలో రాజు నిర్మించారు. రియా సుమన్‌, అవసరాల శ్రీనివాస్‌ కీలకపాత్రలు పోషించారు. ఆదివారం హీరో శ్రీవిష్ణు చేతుల మీదుగా టీజర్‌ను విడుదల చేశారు. అనుకోని సంఘటనతో ముగ్గురు బాల్య స్నేహితులకు అదృష్టం ఎలా కలిసొచ్చిందనే పాయింట్‌ చుట్టూ వినోదాత్మకంగా అల్లుకున్న కథ ఇది అని టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. దర్శకుడు మాట్లాడుతూ ‘మా నిర్మాతతో కలసి రెండేళ్లు స్ర్కిప్ట్‌పైనే పని చేశాను. మా హీరోలు అద్భుతంగా నటించారు. ప్రేక్షకులను మెప్పించే అన్ని అంశాలు మా సినిమాలో ఉన్నాయి’ అన్నారు. మా సినిమా నవంబర్‌లో విడుదలవుతుంది, ప్రేక్షకులు ఆదరించాలి అని అభినవ్‌ గోమఠం కోరారు. ఈ సినిమాకు కిస్మత్‌ అనే పేరుపెట్టడానికి ఆ పాత్రలకు మస్త్‌ కిస్మత్‌ ఉండడమే కారణం అని అభినవ్‌ గోమఠం తెలిపారు.

Updated Date - 2023-10-16T01:54:49+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!