హెబ్బులిగా కిచ్చా సుదీప్
ABN, First Publish Date - 2023-02-08T02:36:49+05:30
కిచ్చా సుదీప్, అమలాపాల్ జంటగా నటించిన కన్నడ చిత్రం ‘హెబ్బులి’. ఎస్. కృష్ణ దర్శకత్వం వహించారు. కబీర్ దుహన్ సింగ్, రవికిషన్ కీలకపాత్రలు పోషించారు...
కిచ్చా సుదీప్, అమలాపాల్ జంటగా నటించిన కన్నడ చిత్రం ‘హెబ్బులి’. ఎస్. కృష్ణ దర్శకత్వం వహించారు. కబీర్ దుహన్ సింగ్, రవికిషన్ కీలకపాత్రలు పోషించారు. నిర్మాత సి. సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఈ చిత్రం ట్రైలర్‌ను నిర్మాత సి. కల్యాణ్ విడుదల చేశారు. పాటలను నిర్మాత ప్రసన్నకుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ విడుదల చేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ‘కన్నడలో ‘హెబ్బులి’ చిత్రం మంచి వసూళ్లను సాధించింది. ఈ నెల 25న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అర్జున్ జన్య. సినిమాటోగ్రఫీ: ఎ. కరుణాకర్