క్రికెట్‌ ప్రియులను అలరించనున్న కియార

ABN , First Publish Date - 2023-03-01T00:58:28+05:30 IST

ఇటీవలే సిద్దార్థ్‌ మల్హొత్రాను పెళ్లి చేసుకున్న బాలీవుడ్‌ హీరోయిన్‌ కియార ఇక ఇప్పుడు కెరీర్‌ మీద దృష్టి పెట్టారు. సెట్స్‌లో అడుగు పెట్టడానికి సిద్ధమయ్యారు...

క్రికెట్‌ ప్రియులను అలరించనున్న కియార

ఇటీవలే సిద్దార్థ్‌ మల్హొత్రాను పెళ్లి చేసుకున్న బాలీవుడ్‌ హీరోయిన్‌ కియార ఇక ఇప్పుడు కెరీర్‌ మీద దృష్టి పెట్టారు. సెట్స్‌లో అడుగు పెట్టడానికి సిద్ధమయ్యారు. తెలుగులో ఆమె రామ్‌చరణ్‌ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే హిందీలో ‘సత్యప్రేమ్‌ కీ కథ’ సినిమాలోనూ నటిస్తున్నారు. సినిమాల సంగతి అలా ఉంచితే క్రికెట్‌ ప్రియులను అలరించడానికి ఆమె సిద్ధమవుతున్నారు. క్రికెట్‌ చరిత్రలోనే తొలి సారిగా జరిగే ఉమెన్‌ ప్రీమియమ్‌ లీగ్‌ 2023 ఈ నెల 4 నుంచి ముంబైలో ప్రారంభం కానుంది. తొలి రోజున ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ జైంట్స్‌ జట్ల మధ్య పోటీ జరుగుతుంది. ప్రారంభోత్సవం సందర్భంగా కియార తన ఆట, పాటలతో అలరించనున్నారని సమాచారం.

Updated Date - 2023-03-01T00:58:30+05:30 IST