ఖుషి.. ఖుషిగా!

ABN , First Publish Date - 2023-08-08T03:51:03+05:30 IST

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకుడు. నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి నిర్మాతలు...

ఖుషి.. ఖుషిగా!

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకుడు. నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయింది. బుధవారం ట్రైలర్‌ విడుదల చేస్తారు. ‘‘పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కించిన చిత్రమిది. కథలోని గాఢత, పాత్రల మధ్య సంఘర్షణ ఆకట్టుకొంటాయి. విజయ్‌, సమంతల మధ్య కెమిస్ర్టీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఇప్పటికే విడుదలైన పాటలకు చక్కటి స్పందన లభిస్తోంది. మిగిలిన పాటలూ ఆకట్టుకొంటాయి’’ అని నిర్మాతలు తెలిపారు. సెప్టెంబరు 1న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. జయరాం, సచిన్‌ ఖేడ్కర్‌, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంగీతం: హిషామ్‌ అబ్దుల్‌ వాహబ్‌.

Updated Date - 2023-08-08T03:51:03+05:30 IST