పబ్‌లో ఖుషి ఖుషీ

ABN , First Publish Date - 2023-08-27T02:35:01+05:30 IST

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ చిత్రం బిగ్‌ స్ర్కీన్‌ మీద సందడి చేయడానికి సిద్ధం అవుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు...

పబ్‌లో ఖుషి ఖుషీ

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ చిత్రం బిగ్‌ స్ర్కీన్‌ మీద సందడి చేయడానికి సిద్ధం అవుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్‌ ఒకటిన విడుదల కానుంది. శనివారం ఈ సినిమా నుంచి ఐదో పాట ‘ఓసి పెళ్లామా’ ను హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకనిర్మాతలతో పాటు సంగీత దర్శకుడు హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌, గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ ‘విజయ్‌ అన్నకు నేను పాడిన తొలి పాట ఇది. మంచి పాట పాడే అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు’ అని చెప్పారు. ‘మిగిలిన అందరికంటే నిర్మాతలుగా మేమే ఈ సినిమా కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం. మీ అందరికీ నచ్చే సినిమా ఇది’’ అన్నారు నవీన్‌. దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ ‘నా సినిమా థియేటర్‌లోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. మళ్లీ మీ అందరినీ ఓ మంచి ఎంటర్‌టైనర్‌తో కలుస్తుండడం ఆనందంగా ఉంది. మీరు మీ ఫ్రెండ్స్‌, గర్ల్‌ ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ మెంబర్స్‌ అందరితో కలసి చూడొచ్చు. ఫన్‌ రైడ్‌లా సినిమా ఉంటుంది’ అన్నారు.

Updated Date - 2023-08-27T02:35:01+05:30 IST