Khushi a love song : ఖుషి .. ఓ ప్రేమ గీతం
ABN , First Publish Date - 2023-07-13T03:33:39+05:30 IST
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకుడు. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. సెప్టెంబరు 1న విడుదల అవుతోంది....
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకుడు. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. సెప్టెంబరు 1న విడుదల అవుతోంది. బుధవారం ‘ఆరాధ్య’ అనే గీతాన్ని విడుదల చేశారు. శివ నిర్వాణ రాసిన పాట ఇది. సిద్ శ్రీరామ్, చిన్మయి ఆలపించారు. హిషామ్ అబ్దుల్ వాహబ్ స్వరాలు అందించారు. ఈ పాటలో విజయ్, సమంతల కెమిస్ర్టీ ఆకట్టుకొంటోంది. ‘‘ఇది వరకు విడుదల చేసిన ‘నా రోజా నువ్వే’ గీతానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ స్థాయిలో నిలిచే పాట ఇద’’ని చిత్ర బృందం తెలిపింది.