‘కేజీఎఫ్‌’ కొనసాగుతోందా?

ABN , First Publish Date - 2023-04-15T00:34:02+05:30 IST

‘కేజీఎఫ్‌’ రెండు చాప్టర్లూ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కన్నడ చిత్రసీమ రూపు రేఖల్ని మార్చేశాయి.

‘కేజీఎఫ్‌’ కొనసాగుతోందా?

‘కేజీఎఫ్‌’ రెండు చాప్టర్లూ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కన్నడ చిత్రసీమ రూపు రేఖల్ని మార్చేశాయి. యశ్‌ని స్టార్‌ హీరో చేశాయి. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ పాపులర్‌ అయిపోయాడు. ‘కేజీఎఫ్‌ చాప్టర్‌ 3’ కూడా రాబోతోందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. యశ్‌, ప్రశాంత్‌ నీల్‌ కూడా కేజీఎఫ్‌ కొనసాగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ ఓ వీడియోని విడుదల చేసింది. ‘‘1978 నుంచి 81 వరకూ రాఖీ భాయ్‌ ఎక్కడ ఉన్నాడు’’ అంటూ ఓ కొత్త ప్రశ్న లేవనెత్తింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంటే.. ఆ మూడేళ్ల కాలంలో రాఖీ భాయ్‌ ఏం చేశాడన్న నేపథ్యంలో మూడో భాగం వచ్చే అవకాశం ఉందన్న హింట్‌..... చిత్ర బృందం పరోక్షంగా ఇచ్చినట్టైంది. ఇటీవల ఓ యాడ్‌ ఫిల్మ్‌లో నటించారు యశ్‌. అందులోనూ కేజీఎఫ్‌ గెటప్‌లోనే ఉన్నారు. అప్పటి నుంచీ ‘చాప్టర్‌ 3’ ఉంటుందన్న ఊహాగానాలకు బలం చేకూరినట్టైంది. తాజాగా నిర్మాతలు విడుదల చేసిన ఈ వీడియో ఆ విషయాన్ని బలపరిచినట్టు అయింది. ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ ప్రభాస్‌ తో ‘సలార్‌’ రూపొందిస్తున్నారు. ఆ తరవాత ఎన్టీఆర్‌ సినిమా ఉంటుంది. ఇవి పూర్తయ్యాకే చాప్టర్‌ 3 సెట్స్‌పైకి వెళ్లొచ్చు.

Updated Date - 2023-04-15T00:34:03+05:30 IST