కార్తికి మాటిచ్చా... జపాన్‌ను సృష్టించా
ABN , First Publish Date - 2023-11-10T02:22:35+05:30 IST
కార్తి కథానాయకుడిగా నటించిన ‘జపాన్’ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాజు మురుగన్ మీడియాతో ముచ్చటించారు. ‘చార్లి చాప్లిన్ స్ఫూర్తితో నేను సినీరంగంలోకి వచ్చాను...

కార్తి కథానాయకుడిగా నటించిన ‘జపాన్’ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాజు మురుగన్ మీడియాతో ముచ్చటించారు. ‘చార్లి చాప్లిన్ స్ఫూర్తితో నేను సినీరంగంలోకి వచ్చాను. మూకీ చిత్రాల ద్వారా ఆయన ప్రేక్షకులను ఆలోచింపజేశారు. ఇప్పుడున్న సాంకేతికతను వాడుకొని సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేయవచ్చు అనిపించింది. అందుకే దర్శకుణ్ణి అయ్యాను. ‘నీతో మంచి వినోదాత్మక చిత్రం చేస్తాన’ని కార్తికి మాటిచ్చా. ఆయన్ను దృష్టిలో ఉంచుకొని జపాన్ పాత్రను సృష్టించాను. ఆ పాత్రే మొత్తం కథను ముందుకు నడిపిస్తుంది. సునీల్, అనూ ఇమ్మాన్యుయేల్ చక్కని నటన కనబరిచారు. ఈ సినిమా మా అందరి కెరీర్‌కు మేలి మలుపు అవుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు.