సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బాలీవుడ్‌ కర్ణుడు

ABN, First Publish Date - 2023-06-13T04:11:59+05:30

దక్షిణాది హీరోలపై బాలీవుడ్‌ దృష్టి సారించింది. తెలుగు, తమిళ హీరోలతో భారీ ప్రాజెక్టులకు హిందీ చిత్రసీమలో రంగం సిద్ధమవుతోంది. అందులో భాగంగా తమిళ కథానాయకుడు సూర్య కూడా త్వరలోనే బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దక్షిణాది హీరోలపై బాలీవుడ్‌ దృష్టి సారించింది. తెలుగు, తమిళ హీరోలతో భారీ ప్రాజెక్టులకు హిందీ చిత్రసీమలో రంగం సిద్ధమవుతోంది. అందులో భాగంగా తమిళ కథానాయకుడు సూర్య కూడా త్వరలోనే బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. దర్శకుడు రాకేశ్‌ ఓం ప్రకాశ్‌ మిశ్రా ఇటీవల సూర్యని కలిసి ఓ కథ వినిపించారని, అది సూర్యకి బాగా నచ్చిందని, వెంటనే ఈ ప్రాజెక్టుకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి ‘కర్ణ’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశార్ట. మహాభారతం ఆఽధారంగా రాసిన కథ ఇది. కర్ణుడిని పోలిన పాత్రలో సూర్య నటించనున్నారు. ఓం ప్రకాశ్‌ మిశ్రాతో సినిమా చేయాలని సూర్య చాలాకాలం నుంచి అనుకొంటున్నారు. కానీ కథ సెట్‌ అవ్వలేదు. ఎట్టకేలకు సూర్యకు నచ్చేలా స్ర్కిప్టు తయారు చేశారీ దర్శకుడు. సూర్య ప్రస్తుతం ‘కంగువ’ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. అది పూర్తయ్యాకే ‘కర్ణ’ సెట్స్‌పైకి వెళ్తుంది.

Updated Date - 2023-06-13T04:12:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!