కన్నెకోడి...వన్నెలాడి

ABN , First Publish Date - 2023-06-15T03:25:38+05:30 IST

శివ కోన ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘రాజుగారి కోడి పులావ్‌’. ‘కుటుంబ కథా విచిత్రం’ అనేది ట్యాగ్‌లైన్‌. ప్రభాకర్‌, కునాల్‌ కౌశల్‌, నేహా దేశ్‌పాండే కీలకపాత్రధారులు...

కన్నెకోడి...వన్నెలాడి

శివ కోన ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘రాజుగారి కోడి పులావ్‌’. ‘కుటుంబ కథా విచిత్రం’ అనేది ట్యాగ్‌లైన్‌. ప్రభాకర్‌, కునాల్‌ కౌశల్‌, నేహా దేశ్‌పాండే కీలకపాత్రధారులు. ఈ చిత్రం నుంచి ‘ఔరౌరా కన్నెకోడి...ఓ వయ్యారి వన్నెలాడి’ అంటూ సాగే రొమాంటిక్‌ గీతాన్ని బుధవారం చిత్రబృందం విడుదల చేసింది. మల్లిక్‌ వల్లభ సాహిత్యానికి, ప్రవీణ్‌ మని స్వరాలు సమకూర్చారు. ఎన్సీ కారుణ్య, వైశాలీ శ్రీ ప్రతాప్‌ ఆలపించారు. సరదాగా అడవిలో విహార యాత్రకు వెళ్లిన మిత్రబృందం అక్కడ ఎదురైన ఆపద నుంచి తమ ప్రాణాలను ఎలా కాపాడుకుందనే కథతో సస్పెన్స్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది.

Updated Date - 2023-06-15T03:25:38+05:30 IST