కంసరాజు ఉగ్రరూపం

ABN , First Publish Date - 2023-10-22T01:56:46+05:30 IST

అశోక్‌ గల్లా కథానాయకుడిగా లలితాంబికా ప్రొడక్షన్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. అర్జున్‌ జంథ్యాల దర్శకుడు. సోమినేని బాలకృష్ణ నిర్మాత. వారణాసి మానస కథానాయిక....

కంసరాజు ఉగ్రరూపం

అశోక్‌ గల్లా కథానాయకుడిగా లలితాంబికా ప్రొడక్షన్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. అర్జున్‌ జంథ్యాల దర్శకుడు. సోమినేని బాలకృష్ణ నిర్మాత. వారణాసి మానస కథానాయిక. ఈ చిత్రంలో దేవదత్త నాగే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన కంసరాజుగా కనిపించనున్నారు. శనివారం చిత్రబృందం దేవదత్త ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేసింది. చేతిలో కత్తి పట్టుకొని.. కంసరాజు తన ఉగ్రరూపం చూపిస్తున్న స్టిల్‌ అది. ‘‘ఆదిపురుష్‌లో నటించిన దేవదత్తకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో తను ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. త్వరలోనే టైటిల్‌ ప్రకటిస్తామ’’ని చిత్రబృందం తెలిపింది.

Updated Date - 2023-10-22T11:21:54+05:30 IST