కల్కి కోసం కమల్‌ వస్తున్నాడు

ABN , First Publish Date - 2023-08-08T03:52:31+05:30 IST

ప్రభాస్‌ కథానాయకుడిగా వైజయంతీ మూవీస్‌ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘కల్కి’. అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రధారి. దీపికా పదుకొణె కథానాయిక...

కల్కి కోసం కమల్‌ వస్తున్నాడు

ప్రభాస్‌ కథానాయకుడిగా వైజయంతీ మూవీస్‌ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘కల్కి’. అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రధారి. దీపికా పదుకొణె కథానాయిక. ఈ చిత్రంలో కమల్‌ హాసన్‌ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే కమల్‌పై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. వచ్చేవారం హైదరాబాద్‌లో ‘కల్కి’ కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. అందులో భాగంగా కమల్‌, ప్రభాస్‌ తదితరులపై టాకీ పార్ట్‌ చిత్రీకరించనున్నారు. ‘కల్కి’ రెండు భాగాలుగా రానుందని ప్రచారం సాగుతోంది. దీనిపై చిత్రబృందం స్పష్టత ఇవ్వాల్సివుంది. 2024 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. విజువల్స్‌ హాలీవుడ్‌ స్థాయిలో ఉన్నాయిని, ప్రభాస్‌ గెటప్‌ కొత్తగా ఉందని సినీ ప్రియులు కితాబు ఇస్తున్నారు.

Updated Date - 2023-08-08T03:52:31+05:30 IST