కల్యాణ ప్రాప్తిరస్తు

ABN , First Publish Date - 2023-05-01T00:18:16+05:30 IST

శేఖర్‌ అయాన్‌ వర్మ, వైభవి రావ్‌ జంటగా నటించిన చిత్రం ‘కల్యాణమస్తు’. ఓ.సాయి దర్శకుడు. బోయపాటి రఘుబాబు నిర్మాత.

కల్యాణ ప్రాప్తిరస్తు

శేఖర్‌ అయాన్‌ వర్మ, వైభవి రావ్‌ జంటగా నటించిన చిత్రం ‘కల్యాణమస్తు’. ఓ.సాయి దర్శకుడు. బోయపాటి రఘుబాబు నిర్మాత. ఆదివారం నటుడు శివబాలాజీ చేతుల మీదుగా ట్రైలర్‌ విడుదలైంది. ఆయన మాట్లాడుతూ ‘‘ట్రైలర్‌ చాలా బాగుంది. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంద’’న్నారు. ‘‘కుటుంబమంతా కలిసి చూసే చక్కటి కథా చిత్రమిది. మే 12న విడుదల చేస్తున్నామ’’న్నారు దర్శకుడు. ‘‘ఓ చిన్న సినిమాని థియేటర్‌ వరకూ తీసుకురావడం చాలా కష్టమైపోయింది. అయినా సరే, రేయింబవళ్లూ కష్టపడి ఈ చిత్రాన్ని పూర్తి చేశాం. ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉంద’’న్నారు నిర్మాత.

Updated Date - 2023-05-01T00:18:16+05:30 IST