సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ట్రైలర్‌లో చూపించనివి చాలా ఉన్నాయి

ABN, First Publish Date - 2023-01-10T00:16:50+05:30

ఈ సంక్రాంతికి విడుదల అవుతున్న చిత్రాల్లో ‘కల్యాణం కమనీయం’ ఒకటి. సంతోష్‌ శోభన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ సంక్రాంతికి విడుదల అవుతున్న చిత్రాల్లో ‘కల్యాణం కమనీయం’ ఒకటి. సంతోష్‌ శోభన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. యూవీ కాన్సెప్ట్‌ సంస్థ నిర్మించింది. ఈ చిత్రంతో అనిల్‌ కుమార్‌ ఆళ్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘పెళ్లయ్యాక భార్యాభర్తల జీవితంలో ఏం జరిగిందో సున్నితమైన వినోదం జోడించి చెప్పాం. కంటెంట్‌ బలంగా ఉంటుంది. ట్రైలర్‌లో చూపించని చాలా అంశాలు సినిమాలో ఉన్నాయి. అవన్నీ థియేటర్లోనే చూడాలన్న ఉద్దేశంతో వాటిని దాచేశాం. యూవీ సంస్థలో పనిచేయడం నా అదృష్టం. తొలి సినిమా అయినా ఎక్కడా టెన్షన్‌ పడకుండా నా పని నేను చేసుకొన్నానంటే.. అదంతా నిర్మాణ సంస్థ వల్లే. పాటలకు మంచి స్పందన వస్తోంద’’న్నారు.

Updated Date - 2023-01-10T00:16:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!