AMIGOS: మూడో లుక్‌ మాములుగా లేదు.. ‘బింబిసార’ను మించేలా..

ABN , First Publish Date - 2023-01-05T21:21:15+05:30 IST

‘బింబిసార‌’ (Bimbisara)తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సత్తా చాటిన నంద‌మూరి హీరో.. క‌ళ్యాణ్ రామ్‌ (Kalyan Ram). ఆ సినిమా తర్వాత మ‌రో డిఫ‌రెంట్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డానికి

AMIGOS: మూడో లుక్‌ మాములుగా లేదు.. ‘బింబిసార’ను మించేలా..
Kalyan Ram in Amigos Film

‘బింబిసార‌’ (Bimbisara)తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సత్తా చాటిన నంద‌మూరి హీరో.. క‌ళ్యాణ్ రామ్‌ (Kalyan Ram). ఆ సినిమా తర్వాత మ‌రో డిఫ‌రెంట్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్య‌మైన చిత్రాలు, విలక్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో మెప్పించ‌టానికి క‌ళ్యాణ్ రామ్ ఆస‌క్తి చూపిస్తుంటారు. త‌న‌దైన పంథాలో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘అమిగోస్’ (Amigos). డెబ్యూ డైరెక్ట‌ర్ రాజేంద్ర రెడ్డి (Rajendra Reddy) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ (Mythri Movie Makers) సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్ర టైటిలే అందరినీ ఆకట్టుకోగా.. ఈ సినిమాకు సంబంధించి విడుదల చేస్తున్న స్టిల్స్ మరింతగా ఆకర్షిస్తున్నాయి. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించబోతున్నారు. రీసెంట్‌గానే రెండు లుక్స్ విడుదల చేశారు. ఓ లుక్‌లో మెలివేసిన మీసాలతో స్టైలిష్ లుక్‌లో కనిపించే పారిశ్రామిక వేత్త సిద్ధార్థ్ పాత్ర అది. తర్వాత మంజునాథ్ అనే అమాయకంగా కనిపించే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్ర. ఈ రెండు లుక్స్‌కి ఫ్యాన్స్, ప్రేక్షకుల నుంచి చాలా మంచి రియాక్షన్ వచ్చింది. తాజాగా మూడో లుక్‌ను విడుదల చేశారు మేకర్స్.

ఇంతకు ముందు విడుదలైన రెండు లుక్స్‌తో పోల్చితే ఈ లుక్ మరింత స్టైలిష్‌గా ఉంది. కానీ ఈ పాత్రను అజ్ఞాతవ్యక్తి పాత్ర అని చెప్పారు. అసలు ఈ మూడు లుక్స్‌కి ఉన్న రిలేషన్ ఏంటి? అనేది తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 10న రిలీజ్ అయ్యే అమిగోస్ సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శక నిర్మాతలు. కళ్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్స్, పోస్టర్స్ కారణంగా సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. ఈ అంచనాలను పెంచేలా జనవరి 8 ఉదయం 11 గంటల 7 నిమిషాలకు టీజర్‌ (Amigos Teaser Release Date)ను రిలీజ్ చేయబోతున్నామని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న ఆషికా రంగ‌నాథ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. దీంతో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌తోనూ టీమ్ బిజీగా ఉంది.

Updated Date - 2023-01-05T21:21:16+05:30 IST