కాళోజీ బయోపిక్‌ను ఆదరించండి

ABN , First Publish Date - 2023-11-18T00:52:47+05:30 IST

ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు జీవిత కథఽ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’. మూలవిరాట్‌ కాళోజీ పాత్రను పోషించారు.

కాళోజీ బయోపిక్‌ను ఆదరించండి

ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు జీవిత కథఽ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’. మూలవిరాట్‌ కాళోజీ పాత్రను పోషించారు. పద్మ, రాజ్‌కుమార్‌, స్వప్న ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రభాకర్‌ జైనీ దర్శకత్వంలో శ్రీమతి విజయలక్ష్మీ జైనీ నిర్మించారు. ఇటీవలే చిత్రబృందం ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నటుడు, దర్శకుడు ఆర్‌ నారాయణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘ఆటిన్‌ బరో మహాత్మాగాంధీ బయోపిక్‌, కృష్ణగారు ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రాలు తీసి తమ జన్మ ధన్యం చేసుకున్నారు. అలాగే కాళోజీ బయోపిక్‌ తీసిన ప్రభాకర్‌ జైనీ దంపతులకు కూడా వారి జన్మ ధన్యం అయిందనుకుంటున్నాను. ప్రజాకవి కాళోజీ నారాయణ ఒక వ్యక్తి కాదు శక్తి. తెలంగాణ కోసం ఉద్యమాలే ఊపిరిగా బతికాడు. ఈ సినిమాను అందరూ ఆదరించాలి’ అని కోరారు. ప్రభాకర్‌ జైనీ మాట్లాడుతూ ‘సినిమా ఫలితం ఎలా ఉంటుందో అనే సంశయం ఉన్నా, వెనుకడుగు వేయకుండా పూర్తి చేశాం. ఒక సజీవ చైతన్యంతో తొణికిసలాడుతున్న తెలంగాణ సమాజాన్ని ఈ చిత్రంలో చూపించాం’ అన్నారు. కాళోజీ గారి ఆత్మ నా ద్వారా ప్రేక్షకులకు పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉందని మూలవిరాట్‌ చెప్పారు.

Updated Date - 2023-11-18T00:52:48+05:30 IST