ఎన్టీఆర్‌తో సినిమా చేస్తానంటున్న హాలీవుడ్‌ డైరెక్టర్‌

ABN , First Publish Date - 2023-04-27T00:22:52+05:30 IST

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకొన్నారు జూనియర్‌ ఎన్టీఆర్‌. కొమురం భీమ్‌గా ఆయన ప్రదర్శించిన నటనకు వారంతా ఫిదా అవుతున్నారు.

ఎన్టీఆర్‌తో సినిమా చేస్తానంటున్న హాలీవుడ్‌ డైరెక్టర్‌

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకొన్నారు జూనియర్‌ ఎన్టీఆర్‌. కొమురం భీమ్‌గా ఆయన ప్రదర్శించిన నటనకు వారంతా ఫిదా అవుతున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్‌తో సినిమాలు చేయడానికి బాలీవుడ్‌ దర్శకులే కాదు హాలీవుడ్‌ దర్శకులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ‘ఫేస్‌ మేకర్‌’, ‘ద సూసైడ్‌ స్క్వాడ్‌ ’ వంటి చిత్రాలు రూపొందించిన దర్శకుడు జేమ్స్‌ గన్‌ ఎన్టీఆర్‌తో కలసి పనిచేయాలనుందని చెప్పారు. జేమ్స్‌ రూపొందించిన ‘గార్డియన్స్‌ ఆఫ్‌ గెలాక్సీ 3’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చేసిన ఓ వెబ్‌ సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ‘ఇండియన్‌ హీరోలలో ఎవరితో నైనా కలసి పనిచేయాలని ఉందా?’ అని అడిగితే ఆసక్తికరమైన సమాధానం చెప్పారు జేమ్స్‌. ‘ ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నటించాడే ఆర్టిస్ట్‌ .. అద్భుతంగా ఉంది అతని నటన. బోన్లలో ఉన్న పులులతో పాటు బయటకు వస్తూ అతను ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ చాలా బాగుంది. అతనితో కలసి పని చేయాలని ఉంది’ అని చెప్పారు. జేమ్స్‌ గన్‌ వంటి పాపులర్‌ డైరెక్టర్‌ ఇలా చెప్పడంతో ఎన్టీఆర్‌ అభిమానులు ఆనందంతో గంతులు వేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ త్వరలోనే ప్రారంభం కావాలని వారు కోరుకుంటున్నారు.

Updated Date - 2023-04-27T00:22:52+05:30 IST