జయప్రదకు ఆర్నెల్ల జైలు

ABN , First Publish Date - 2023-08-12T00:57:25+05:30 IST

ఈఎ్‌సఐ స్కామ్‌లో సీనియర్‌ నటి జయప్రదకు ఎగ్మూర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఆర్నెల్ల జైలుశిక్షతో పాటు రూ.5 వేల జరిమానా కూడా విధించింది.

జయప్రదకు ఆర్నెల్ల జైలు

ఈఎ్‌సఐ స్కామ్‌లో సీనియర్‌ నటి జయప్రదకు ఎగ్మూర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఆర్నెల్ల జైలుశిక్షతో పాటు రూ.5 వేల జరిమానా కూడా విధించింది. ఈ కేసులో మరో ఇద్దరికి కూడా ఇదే తరహా శిక్షను విధిస్తూ కోర్టు శుక్రవారం తీర్పును వెలువరించింది. రాయపేటలో జయప్రదకు రెండు థియేటర్లు ఉన్నాయి. వీటిని ఆమె సోదరులు రాజ్‌కుమార్‌, రాజ్‌బాబులతో నిర్వహిస్తున్నారు. ఈ థియేటర్లలో పనిచేసిన కార్మికుల నుంచి వసూలు చేసిన ఈఎ్‌సఐ సొమ్మును ప్రభుత్వ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌కు చెల్లించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయంపై గవర్నమెంట్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ కంపెనీ ఎగ్మూర్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా, కొన్నేళ్ళుగా ఈ కేసు విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం మరోమారు ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలు ఆలకించిన కోర్టు.. జయప్రద తరపున దాఖలు చేసిన పిటిషన్‌లను తోసిపుచ్చుతూ, ఆమెతోపాటు మరో ఇద్దరికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.5 వేల చొప్పున జరిమానా విధించింది. కాగా, ఇదే కేసులో జయప్రద తరపున దాఖలు చేసిన పిటిషన్‌ను గతంలోనే హైకోర్టు తోసిపుచ్చింది.

Updated Date - 2023-08-12T00:57:25+05:30 IST