గ్రామీణ ప్రేమకు జై
ABN, Publish Date - Dec 24 , 2023 | 02:49 AM
ఓ యథార్థ సంఘటన ఆధారంగా గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకొన్న చిత్రం ‘ప్రేమకు జై’. అనిల్ బురగాని, జ్వలిత హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో ప్రతినాయకునిగా దుబ్బాక భాస్కర్ నటించారు...
ఓ యథార్థ సంఘటన ఆధారంగా గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకొన్న చిత్రం ‘ప్రేమకు జై’. అనిల్ బురగాని, జ్వలిత హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో ప్రతినాయకునిగా దుబ్బాక భాస్కర్ నటించారు. శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం కొత్త సంవత్సరంలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సీనియర్ రచయిత శివశక్తి దత్త ఈ చిత్రం పోస్టర్‌ను, టీజర్‌ను విడుదల చేసి, యూనిట్‌కు అభినందనలు తెలిపారు. సినిమా షూటింగ్ పూర్తయిందనీ, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని నిర్మాత అనసూర్య చెప్పారు.