జవాన్ రెడీ
ABN , First Publish Date - 2023-08-24T02:42:07+05:30 IST
‘పఠాన్’ చిత్రంతో బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించి సత్తా చాటారు బాలీవుడ్ కథానాయకుడు షారూఖ్‌ఖాన్. ఈసారి ‘జవాన్’ చిత్రంతో ఆయన ప్రేక్షకుల ముందుకొస్తున్నారు...

‘పఠాన్’ చిత్రంతో బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించి సత్తా చాటారు బాలీవుడ్ కథానాయకుడు షారూఖ్‌ఖాన్. ఈసారి ‘జవాన్’ చిత్రంతో ఆయన ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక. గౌరీ ఖాన్ నిర్మాత. సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేస్తున్నారు. బుధవారం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు/ఎ సర్టిఫికెట్‌ను సెన్సార్‌బోర్డ్ జారీ చేసింది. కొన్ని వివాదాస్పద డైలాగ్స్, అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని సెన్సార్‌బోర్డ్ చెప్పింది. 2.49 గంటల నిడివి ఉన్న ఈ చిత్రంలో మొత్తం ఏడు చోట్ల మార్పులు చేయాలని సూచించింది. ఈ చిత్రంలో విజయ్‌సేతుపతి ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ప్రియమణి, సన్యామల్హోత్రా కీలకపాత్రలు పోషిస్తున్నారు. దీపికా పదుకొణె అతిథి పాత్రలో అలరించనున్నారు. యాక్షన్ ప్రధానంగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఆరుగురు యాక్షన్ డైరెక్టర్లు పనిచేశారని యూనిట్ తెలిపింది.