దీపావళికి జపాన్‌ టపాకా

ABN , First Publish Date - 2023-10-18T03:01:35+05:30 IST

కార్తి హీరోగా నటించిన చిత్రం ‘జపాన్‌’. అను ఇమ్మానియేల్‌ కథానాయిక. సునీల్‌, విజయ్‌ మిల్టన్‌ కీలక పాత్రలు పోషించారు. ఎస్‌.ఆర్‌.ప్రకాశ్‌ బాబు, ఎస్‌.ఆర్‌. ప్రభు నిర్మాతలు. రాజు మురుగన్‌ దర్శకత్వం వహించారు...

దీపావళికి జపాన్‌ టపాకా

కార్తి హీరోగా నటించిన చిత్రం ‘జపాన్‌’. అను ఇమ్మానియేల్‌ కథానాయిక. సునీల్‌, విజయ్‌ మిల్టన్‌ కీలక పాత్రలు పోషించారు. ఎస్‌.ఆర్‌.ప్రకాశ్‌ బాబు, ఎస్‌.ఆర్‌. ప్రభు నిర్మాతలు. రాజు మురుగన్‌ దర్శకత్వం వహించారు. దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ‘‘వరుస విజయాలతో దూసుకుపోతున్న కార్తి కెరీర్‌లో ‘జపాన్‌’ ఓ ప్రత్యేక చిత్రంగా నిలిచిపోతుంది. తన పాత్ర చిత్రణ సినిమాకే హైలెట్‌. కథలో ట్విస్టులు ఆకట్టుకొంటాయి. మాస్‌కి, క్లాస్‌కి కావల్సిన అన్ని హంగులూ ఈ చిత్రంలో ఉన్నాయి. త్వరలోనే టీజర్‌ విడుదల చేస్తామ’’న్నారు నిర్మాతలు. సంగీతం: జి.వి.ప్రకాశ్‌ కుమార్‌.

Updated Date - 2023-10-18T03:01:35+05:30 IST