జంతర్‌ మంతర్‌.. ఛూ మంతర్‌!

ABN , First Publish Date - 2023-05-16T01:57:11+05:30 IST

చరణ్‌ లక్కరాజు, యశశ్రీ జంటగా నటించే ‘ ఛూమంతర్‌’ చిత్రం షూటింగ్‌ సోమవారం ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభమైంది...

జంతర్‌ మంతర్‌.. ఛూ మంతర్‌!

చరణ్‌ లక్కరాజు, యశశ్రీ జంటగా నటించే ‘ ఛూమంతర్‌’ చిత్రం షూటింగ్‌ సోమవారం ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. బి. కల్యాణ్‌కుమార్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ వెంకట్‌ కిరణ్‌కుమార్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిర్మాత కిరణ్‌ తల్లి శ్రీలక్ష్మి కెమెరా స్విచాన్‌ చేయగా, ‘ఎబీసీడీ’ చిత్ర దర్శకుడు సంజీవ్‌రెడ్డి క్లాప్‌ ఇచ్చారు. ‘ఉరి’ చిత్ర దర్శకుడు శ్రీనివాస్‌ తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు. సరికొత్త కాన్పెప్ట్‌తో వస్తున్న చిత్రం ఇదనీ, తమ బేనర్‌లో రూపొందుతున్న మూడో సినిమా అనీ నిర్మాత చెప్పారు. ‘బలగం’ రూపాలక్ష్మి, ‘చిత్రం’ శ్రీను, యోగి కత్రి, ‘జబర్దస్త్‌’ కుమరం, గడ్డం నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: నివాస్‌, పాటలు: కాసర్ల శ్యామ్‌, చాందిని, సంగీతం: సుధా శ్రీనివాస్‌, ఫొటోగ్రఫీ: ముధుసూదన్‌ కోట, ఎడిటింగ్‌: నాగేశ్వరరెడ్డి, సహ నిర్మాతలు: సందీప్‌, రవి.

Updated Date - 2023-05-16T01:57:11+05:30 IST