థియేటర్స్ పెరుగుతున్నాయి
ABN , First Publish Date - 2023-08-21T02:11:25+05:30 IST
పలు విజయవంతమైన చిత్రాలను అందించిన దర్శకుడు కె. విజయ్‌భాస్కర్ రూపొందించిన తాజా చిత్రం ‘జిలేబి’. ఇటీవలే విడుదలైంది.

పలు విజయవంతమైన చిత్రాలను అందించిన దర్శకుడు కె. విజయ్‌భాస్కర్ రూపొందించిన తాజా చిత్రం ‘జిలేబి’. ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రబృందం నిర్వహించిన సక్సె్‌సమీట్‌లో విజయ్ భాస్కర్ మాట్లాడుతూ ‘సినిమాపై నమ్మకంతో మా నిర్మాతలు సొంతంగా రిలీజ్ చే శారు. రాజేంద్రప్రసాద్, మురళీశర్మ వారి అనుభవాన్ని జోడించారు. ప్రతి ఒక్కరికీ తమ చదువుకునే రోజులను మళ్లీ గుర్తుకు తెస్తోంది’ అన్నారు. హీరోగా నా మొదటి చిత్రానికే ఇంత గొప్ప ఆదరణ దక్కడం ఆనందాన్నిచ్చింది, థియేటర్స్ పెరుగుతున్నాయి అని శ్రీ కమల్ చెప్పారు.