‘జైలర్‌’ నటుడు మారిముత్తు హఠాన్మరణం

ABN , First Publish Date - 2023-09-09T04:17:27+05:30 IST

ప్రముఖ తమిళనటుడు మారిముత్తు (56) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. శుక్రవారం ఉదయం డబ్బింగ్‌ స్టూడియోలో ‘ఎదిర్‌ నీచ్చల్‌’ అనే సీరియల్‌కు డబ్బింగ్‌ చెబుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే వడపళనిలోని

‘జైలర్‌’ నటుడు మారిముత్తు హఠాన్మరణం

ప్రముఖ తమిళనటుడు మారిముత్తు (56) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. శుక్రవారం ఉదయం డబ్బింగ్‌ స్టూడియోలో ‘ఎదిర్‌ నీచ్చల్‌’ అనే సీరియల్‌కు డబ్బింగ్‌ చెబుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే వడపళనిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. మారిముత్తు సొంతూరైన తేని జిల్లా పసుమలై గ్రామంలో శనివారం అంత్యక్రియలు జరుగనున్నాయి. సినిమాలపై ఉన్న వ్యామోహంతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మారిముత్తు.. సీమాన్‌, మణిరత్నం, వసంత్‌, ఎస్‌జే సూర్య వంటి దర్శకుల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు. ‘కన్నుమ్‌ కన్నుమ్‌’ అనే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. అనంతరం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారి వందకు పైగా చిత్రాల్లో నటించారు. చివరిగా ఆయన రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘జైలర్‌’ చిత్రంలో కనిపించారు. విలన్‌ గ్యాంగ్‌లో ఉండే ప్రధాన పాత్రను ఆయన పోషించారు.

ఆంధ్రజ్యోతి, (చెన్నై)

Updated Date - 2023-09-09T04:17:30+05:30 IST