బాగుందమ్మా.. ముద్దుగుమ్మా!
ABN , First Publish Date - 2023-06-04T02:25:03+05:30 IST
చెందు ముద్దు దర్శకత్వం వహించిన చిత్రం ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’. చైతన్య రావు, లావణ్య, మిహిరా ప్రధాన పాత్రలు పోషించారు. యశ్ రంగినేని నిర్మాత. ఈ చిత్రం నుంచి ‘ముద్దుగుమ్మ’ అనే గీతాన్ని...

చెందు ముద్దు దర్శకత్వం వహించిన చిత్రం ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’. చైతన్య రావు, లావణ్య, మిహిరా ప్రధాన పాత్రలు పోషించారు. యశ్ రంగినేని నిర్మాత. ఈ చిత్రం నుంచి ‘ముద్దుగుమ్మ’ అనే గీతాన్ని శనివారం హైదరాబాద్‌లో యువ కథానాయకుడు విశ్వక్‌సేన్ విడుదల చేశారు. శ్రేష్ఠ రాసిన పాట ఇది. ప్రిన్స్ హెన్సీ స్వరాలు సమకూర్చారు. లిప్సిక పాడారు. ‘‘ఈ పాట నాకు బాగా నచ్చింది. వింటున్నప్పుడే నేను కూడా హమ్ చేశాను. సంగీత దర్శకుడు హెన్సీకి మరిన్ని మంచి అవకాశాలు వస్తాయన్న నమ్మకం ఉంద’’న్నారు విశ్వక్. ‘‘ఇప్పటి వరకూ విడుదల చేసిన మూడు పాటలకూ మంచి స్పందన వచ్చింది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’న్నారు దర్శక నిర్మాతలు.