కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నాపై నాకు నమ్మకం పెంచిన విజయమిది

ABN, First Publish Date - 2023-08-27T02:31:09+05:30

‘‘ఓ సీరియస్‌ విషయాన్ని వినోదం జోడించి చెప్పాం. ఆ విధానం ప్రేక్షకులకు నచ్చింది. అందుకే మంచి విజయాన్ని అందించార’’న్నారు కార్తికేయ. ఆయన కథానాయకుడిగా నటించిన ‘బెదురులంక 2012’ ఇటీవలే...

‘‘ఓ సీరియస్‌ విషయాన్ని వినోదం జోడించి చెప్పాం. ఆ విధానం ప్రేక్షకులకు నచ్చింది. అందుకే మంచి విజయాన్ని అందించార’’న్నారు కార్తికేయ. ఆయన కథానాయకుడిగా నటించిన ‘బెదురులంక 2012’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి వస్తున్న స్పందన పట్ల కార్తికేయ సంతోషం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడుతూ ‘‘కథ విన్నప్పుడు ఎలాంటి అనుభూతి కలిగిందో తెరపై సినిమా చూస్తున్నప్పుడు కూడా అంతే ఆనందం కలిగింది. కొన్ని సినిమాలు హిట్టయితే మనపై మనకు నమ్మకం పెరుగుతుంది. అలాంటి విజయం ఇద’’న్నారు. ‘‘ద్వితీయార్థం చాలా బాగుందని, చివరి అరగంట నవ్వుతూనే ఉన్నామని ప్రేక్షకులు చెబుతున్నారు. మేం నమ్మింది కూడా ఇదే. థియేటర్లు పెంచుతున్నామని డిస్ర్టిబ్యూటర్లు చెప్పడం మరింత ఆనందాన్ని కలిగించింద’’న్నారు దర్శకుడు క్లాక్స్‌. ‘‘ఈ సినిమాతో మేం అనుకొన్న టార్గెట్‌ రీచ్‌ అయ్యామ’’ని నిర్మాత బెన్నీ చెప్పారు.

Updated Date - 2023-08-27T02:31:09+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!