నా కెరీర్‌లో భారీ బడ్జెట్‌ చిత్రమిది

ABN , First Publish Date - 2023-09-12T01:01:56+05:30 IST

విశాల్‌, రీతూవర్మ జంటగా నటించిన ‘మార్క్‌ ఆంటోనీ’ చిత్రం ఈ నె 15న విడుదల కానుంది. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో ఎస్‌.వినోద్‌కుమార్‌ నిర్మించారు. విశాల్‌ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం...

నా కెరీర్‌లో భారీ బడ్జెట్‌ చిత్రమిది

విశాల్‌, రీతూవర్మ జంటగా నటించిన ‘మార్క్‌ ఆంటోనీ’ చిత్రం ఈ నె 15న విడుదల కానుంది. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో ఎస్‌.వినోద్‌కుమార్‌ నిర్మించారు. విశాల్‌ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో ఎస్‌.జె.సూర్య కీలక పాత్ర పోషించారు. ఆదివారం నిర్వహించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో ముఖ్య అతిధిగా పాల్గొన్న హీరో నితిన్‌ మాట్లాడుతూ ‘విశాల్‌ నాకు మంచి స్నేహితుడు. ఆయన నటించే సినిమాలన్నీ హిట్‌ అవ్వాలనీ కోరుకుంటాను. ఈ చిత్రంతో ఆయన మరో స్థాయికి వెళ్లాలి. దర్శకుడు అధిక్‌ ‘మార్క్‌ ఆంటోనీ’ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు’ అన్నారు. విశాల్‌ మాట్లాడుతూ ‘నితిన్‌ నాకు తమ్ముడిలాంటి వాడు. రానా, నితిన్‌లతోనే నేను ఎక్కువగా గడుపుతుంటాను.నిర్మాత వినోద్‌ ఇచ్చిన స్వేచ్ఛ వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. నా కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్‌ చిత్రం. వేణుగారు తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. మార్క్‌ ఆంటోనీ అందరికీ నచ్చుతుంది. ఆడియన్స్‌ పెట్టే డబ్బుకు న్యాయం జరుగుతుంది’ అన్నారు. ‘ఈ చిత్రకథ వినమనీ, సినిమా చేయమనీ విశాల్‌ నా మీద ఒత్తిడి తెచ్చారు. ఆయన వల్లే చేశాను. ఆయన మాట వినకుండా ఉంటే మంచి సినిమా మిస్‌ అయ్యేవాణ్ణి’ అని సూర్య అన్నారు. విశాల్‌లోని పరిపూర్న నటుడిని ఈ సినిమాలో చూస్తారని దర్శకుడు అధిక్‌ రవిచంద్రన్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో హాస్య నటుడు సునీల్‌, బెక్కం వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-12T01:01:56+05:30 IST