రాజకీయాల్లో జోక్యం చేసుకోకపోవడమే ఉత్తమం

ABN , First Publish Date - 2023-09-20T01:01:25+05:30 IST

చిత్రసీమ రాజకీయ విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిదని ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు అభిప్రాయపడ్డారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మీడియాతో ఆయన మాట్లాడారు...

రాజకీయాల్లో జోక్యం చేసుకోకపోవడమే ఉత్తమం

చిత్రసీమ రాజకీయ విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిదని ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు అభిప్రాయపడ్డారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మీడియాతో ఆయన మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో చిత్రసీమ నుంచి స్పందన రావడం లేదన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ‘‘చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ చాలా సున్నితమైన విషయం. గతంలో మా నాన్నగారు టీడీపీ పార్టీలో ఉన్నారు. నేనూ పార్టీకి ప్రచారం చేశాను. పార్టీ మీద అభిమానం వేరు. నిర్మాతగా సురేశ్‌బాబు వేరు. మేం రాజకీయ నాయకులం కాదు. మీడియా ప్రతినిధులం కాదు. పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు రాజకీయంగా మాట్లాడడం సరైనది కాదు. మాట్లాడాల్సివస్తే ప్రతీ రోజూ ఏదో ఓ ఇష్యూ జరుగతూనే ఉంటుంది. అన్ని విషయాల గురించీ మాట్లాడలేం కదా? ఓ నాయకుడ్ని ఇష్టపడడం అనేది పూర్తిగా వ్యక్తిగతం. గతంలో ఆంధ్రా, తెలంగాణ విభజన సమయంలోనూ చిత్రసీమ మౌనంగానే ఉంది. రాజకీయాలకు అతీతంగా తటస్థంగా ఉండడం చిత్రసీమకు మంచిద’’న్నారు.

Updated Date - 2023-09-20T01:01:25+05:30 IST