అన్ని వాణిజ్య హంగులున్న చిత్రమిది

ABN , First Publish Date - 2023-10-13T00:44:23+05:30 IST

‘అక్కడొకడుంటాడు’ ఫేమ్‌ శివ కంఠమనేని హీరోగా నటించిన చిత్రం ‘మధురపూడి గ్రామం అనే నేను’. మల్లి దర్శకత్వం వహించారు. కేఎస్‌ శంకరరావు, ఆర్‌. వెంకటేశ్వరరావు నిర్మించారు...

అన్ని వాణిజ్య హంగులున్న చిత్రమిది

‘అక్కడొకడుంటాడు’ ఫేమ్‌ శివ కంఠమనేని హీరోగా నటించిన చిత్రం ‘మధురపూడి గ్రామం అనే నేను’. మల్లి దర్శకత్వం వహించారు. కేఎస్‌ శంకరరావు, ఆర్‌. వెంకటేశ్వరరావు నిర్మించారు. నేడు ఈ చిత్రం విడుదలవుతోన్న సందర్భంగా శివ కంఠమనేని మీడియాతో మాట్లాడారు. ‘అక్కడొకడుంటాడు’ చిత్రం పోస్టర్‌లో నన్ను చూసి తను రాసుకున్న కథకు హీరోగా నేను సరిపోతానని మల్లి అనుకున్నారు. అన్ని వాణిజ్య హంగులున్న చిత్రమిది. ఇందులో నేను సూరి అనే పాత్ర పోషించాను. బాబ్జీ అనే మరో పాత్ర సినిమాలో కీలకం. ఈ రెండు పాత్రల మధ్య ఉన్న సంబంధం ఎలాంటి పరిణామాలకు దారితీసింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా కోసం మెథడ్‌ యాక్టింగ్‌ చేయాల్సి వచ్చింది. సూరి పాత్రను పండించడానికి చాలా కష్టపడ్డాను. పూర్తిగా గ్రామంలో జరిగే కథ ఇది. ఒంగోలు యాసలో సంభాషణలు సాగుతాయి. పల్లెలో జరిగే అన్ని రకాల సంఘటనలు, ఎమోషన్స్‌ చూపించాం. మణిశర్మ నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం ‘ఆదిపర్వం, మణిశంకర్‌, రాఘవరెడ్డి’ చిత్రాల్లో నటిస్తున్నాను.

Updated Date - 2023-10-13T00:44:23+05:30 IST